- Advertisement -
– 15 మంది మృతి.. 30 మందికి పైగా గాయాలు
కొలంబొ : శ్రీలంకలో ప్రయాణికుల బస్సు కొండపై నుంచి జారిపడింది. ఈ ప్రమాదంలో ఎనిమిదిమంది మరణించగా, 30మందికి పైగా గాయపడినట్టు అధికారులు తెలిపారు. రాజధాని కొలంబోకు తూర్పున 140 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొట్మలే పట్టణానికి సమీపంలో ఆదివారం తెల్లవారుజామున ఈప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. తేయాకు తోటలు అధికంగా ఉండే ఈ ప్రాంతంలో కొండపై నుంచి బస్సు జారిపడినట్టు వెల్లడించారు. డ్రైవర్ సహా పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారనీ, వారిని స్థానిక ఆస్పత్రికి తరలించామని అన్నారు. ఈ బస్సును ప్రభుత్వ ఆధీనంలోని ట్రావెల్ కంపెనీ నడుపుతోందని చెప్పారు. ప్రమాదంపై విచారణకు ఆదేశించినట్టు తెలిపారు.
- Advertisement -