Tuesday, December 16, 2025
E-PAPER
Homeజాతీయంఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌ రహదారిపై బస్సుల్లో మంటలు..నలుగురు మృతి

ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌ రహదారిపై బస్సుల్లో మంటలు..నలుగురు మృతి

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : ఉత్తరప్రదేశ్‌లో మంగళవారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మధురలోని ఢిల్లీ- ఆగ్రా ఎక్స్‌ప్రెస్ రహదారిపై నాలుగు బస్సులకు మంటలు అంటుకున్నాయి. పొగ మంచు కారణంగా ఏడు బస్సులు, మూడు కార్లు పరస్పరం ఢీకొన్నాయి. ఈ క్రమంలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో నలుగురు మృతిచెందినట్లు అధికారులు తెలిపారు. గాయపడిన 25 మందిని ఆస్పత్రికి తరలించారు. స్థానికుల సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు యత్నిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -