నవతెలంగాణ-హైదరాబాద్ : ప్రయాణికులకు టీజీఎస్ఆర్టీసీ శుభవార్త చెప్పింది. హైదరాబాద్‌లోని ఎంజీబిఎస్‌లో బస్సుల రాకపోకలు మొదలయ్యాయి. శుక్రవారం మూసీ నదికి భారీ వరద నేపథ్యంలో ఎంబీజీఎస్ ప్రాంగణంలోకి వరద నీరు చేరింది. దీంతో ఎంజీబీఎస్ బస్ స్టేషన్ నుంచి బస్సుల రాకపోకలను టీజీఎస్ఆర్టీసీ తాత్కాలికంగా నిలిపివేసిన విషయం తెలిసిందే. ఎంబీజీఎస్ నుంచి బయలుదేరే బస్సులను హైదరాబాద్ లోని వివిధ ప్రాంతాల నుంచి సంస్థ ఇప్పటి వరకు నడిపించింది. తాజాగా వరద ప్రవాహం తగ్గడంతో ఆదివారం మధ్యాహ్నం నుంచి ఆర్టీసీ బస్సులను ఎంజీబీఎస్ నుంచి పునరుద్దరించారు. తెలంగాణలోని అన్ని జిల్లాలకు బస్సులను అధికారులు అందబాటులోకి ఉంచారు. దసరా పండుగ సందర్భంగా ప్రయాణికులతో ప్రస్తుతం ఎంజీబీఎస్ కిటకిటలాడుతోంది.
MGBSలో మొదలైన బస్సుల రాకపోకలు..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES