నవతెలంగాణ-పాలకుర్తి : ట్రాఫిక్ నిబంధనలకు విరుద్ధంగా రోడ్లపైనే వ్యాపారం నిర్వహించడంతో వాహనదారులు అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. వారాంతపు సంతలో భాగంగా సోమవారం పండ్ల వ్యాపారులు యదేచ్చగా రోడ్లపైనే వ్యాపారం చేయడంతో పాటు కొనుగోలు చేసే వినియోగదారులు వాహనాలను రోడ్లపై నిలపడంతో బస్సులతోపాటు మిగతా వాహనాలకు ఇబ్బందులు తప్పలేదు. వ్యాపారస్తులతో విశాలంగా ఉన్న రోడ్డు ఇరుకుగా మారింది. రోడ్లపై వ్యాపారాలను నివారించేందుకు గ్రామపంచాయతీ, పోలీస్ శాఖ చర్యలు చేపట్టాల్సి ఉండగా అంటి ముట్టనట్లుగా వ్యవహరించడంతో వ్యాపారస్తులు యదేచ్చగా రోడ్లపైనే వ్యాపారాలు చేసుకుంటున్నారని విమర్శలు ఉన్నాయి. ఇప్పటికైనా గ్రామపంచాయతీ, పోలీస్ శాఖ వారాంతపు సంత సందర్భంగా నివారణ చర్యలు చేపట్టి రోడ్లపై వ్యాపారాలను అరికట్టాలని వాహనదారులు కోరుచున్నారు.
రోడ్లపైనే వ్యాపారం..వాహనదారుల ఇబ్బందులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES