నవతెలంగాణ-హైదరాబాద్ : దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉపఎన్నికల షెడ్యూల్ పై కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటన జారీ చేసింది. ఈ ఉపఎన్నికలు గుజరాత్, కేరళ, పంజాబ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోని ఐదు అసెంబ్లీ స్థానాలకు జరగనున్నాయి. ఈ స్థానాలు వివిధ కారణాల వల్ల ఎమ్మెల్యేల రాజీనామా, మరణం, ఖాళీ అయ్యాయి. తాజాగా ఎన్నికల సంఘం విడుదల చేసి షెడ్యూల్ ప్రకారం.. ఈ నెల 26న నోటిఫికేషన్ విడుదల అవుతుంది.
అలాగే జూన్ 2 వరకు నామినేషన్లకు అవకాశం ఇవ్వనున్నారు. జూన్ 3న నామినేషన్ల పరిశీలన, జూన్ 5 వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఇచ్చారు. అలాగే జూన్ 19న నాలుగు రాష్ట్రాల్లో ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుంది. జూన్ 25 ఈ ఎన్నికల ఓట్ల లెక్కింపు చేపట్టునున్నారు. ఈ ఉప ఎన్నికలు 2024 సార్వత్రిక ఎన్నికల తర్వాత.. తమిళనాడు, బీహార్ ఎన్నికల ముందు వస్తుండటంతో ఇవి రాజకీయంగా కీలకమైనవిగా పరిగణించబడుతున్నాయి.
ఐదు అసెంబ్లీలకు ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES