న్యూఢిల్లీ: నాలుగు రాష్ట్రాల్లోని ఐదు అసెంబ్లీ స్థానాలకు భారత ఎన్నికల కమిషన్ (ఈసీఐ) ఆదివారం ఉప ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసింది. గుజరాత్, కేరళ, పంజాబ్, పశ్చిమబెంగాల్‌లోని ఐదు నియోజకవర్గాలకు జూన్ 19న పోలింగ్, జూన్ 23న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్టు ఈసీ ప్రకటించింది. ఉప ఎన్నికలు జరగనున్న ఐదు నియోజకవర్గాల్లో రెండు గుజరాత్‌లోనే ఉన్నాయి. కాడి (రిజర్వ్ సీటు), విశావదర్‌లతో పాటు కేరళలోని నిలంబూర్, పంజాబ్‌లో లూథియానా వెస్ట్, పశ్చిమబెంగాల్‌లోని కాలిగం జ్ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నట్లు ఈసీఐ ఆదివారం తన ఎక్స్ ఖాతా లో పోస్ట్ చేసింది. గెజిట్ నోటిఫికేషన్‌ను ఈ నెల26న విడుదల చేయనున్నట్టు తెలిపింది. నామినేషన్లు దాఖలు చేయడానికి చివరి తేదీ జూన్ 2, నామినేషన్ల పరిశీలన తేదీ జూన్ 3, నామినేషన్ల ఉపసంహరణకు చివరితేదీ జూన్ 5.