Sunday, August 31, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్Kriti Sanon: క్యాంపస్ యాక్టివ్‌వేర్ మహిళా విభాగానికి బ్రాండ్ అంబాసిడర్ కృతి సనన్‌

Kriti Sanon: క్యాంపస్ యాక్టివ్‌వేర్ మహిళా విభాగానికి బ్రాండ్ అంబాసిడర్ కృతి సనన్‌

- Advertisement -

నవతెలంగాణ న్యూఢిల్లీ: భారతదేశంలోని ప్రముఖ స్పోర్ట్స్ , అథ్లెజర్ ఫుట్‌వేర్ బ్రాండ్‌లలో ఒకటైన క్యాంపస్ యాక్టివ్‌వేర్, జాతీయ అవార్డు గెలుచుకున్న నటి కృతి సనన్‌ను తమ మహిళా విభాగానికి నూతన ప్రచారకర్తగా ఎంపిక చేసుకున్నట్లు వెల్లడించింది. ఈ భాగస్వామ్యం బ్రాండ్-సెలబ్రిటీ భాగస్వామ్యం కంటే ఎక్కువను సూచిస్తుంది. ఇది భారతదేశంలో మహిళల పాదరక్షల విభాగం యొక్క భవిష్యత్తును రూపొందించాలనే క్యాంపస్ లక్ష్యంను ప్రతిబింబిస్తుంది.

ఈ భాగస్వామ్యం గురించి క్యాంపస్ యాక్టివ్‌వేర్ లిమిటెడ్ సీఈఓ,హోల్ టైమ్ డైరెక్టర్ నిఖిల్ అగర్వాల్ మాట్లాడుతూ, “క్యాంపస్ మహిళల విభాగానికి కృతి సనన్‌ను స్వాగతిస్తున్నందుకు మేము చాలా సంతోషంగా ఉన్నాము. ఆమె లక్ష్యం , బహుముఖ ప్రజ్ఞ , ప్రామాణికత నేటి భారతీయ మహిళల స్ఫూర్తిని ప్రతిబింబిస్తాయి. మహిళల క్రీడా, అథ్లెజర్ మాకు అత్యంత ముఖ్యమైన వృద్ధి చోదకాల్లో ఒకటిగా ఉద్భవించింది. మా డిజైన్ భాషను మెరుగుపరచటం, మహిళల అభిరుచులకు తగిన ఆవిష్కరణలను చేయటం ద్వారా వేగంగా అభివృద్ధి చెందుతున్న విభాగంలో క్యాంపస్ నాయకత్వాన్ని మరింత బలోపేతం చేయనున్నాం” అని అన్నారు.

కృతి సనన్ మాట్లాడుతూ “స్టైల్ అనేది, మీరు ఎవరో ప్రతిబింబించెలా ఉండాలన్నది నా భావన. నా వరకూ , క్యాంపస్, ఒక ఐకానిక్ స్వదేశీ స్నీకర్ బ్రాండ్. అది నా నమ్మకాన్ని ప్రతిబింబిస్తుంది. క్యాంపస్ కుటుంబంలో చేరడం పట్ల సంతోషంగా ఉన్నాను” అని అన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad