- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేళ మాగంటి సునీతపై సంచలన ఆరోపణలు వచ్చాయి. తాను మాగంటి గోపీనాథ్ మొదటి భార్య మాలినీదేవి కొడుకును అని తారక్ ప్రద్యుమ్న అనే వ్యక్తి బయటికొచ్చారు. తన తల్లికి విడాకులు ఇవ్వకుండా సునీతతో ఆయన లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉన్నారన్నారు. ఆమె నామినేషన్ రద్దు చేయాలని ఈసీకి ఫిర్యాదు చేశారు. చట్టబద్ధంగా గోపీనాథ్‌కు తానే ఏకైక కుమారుడిని అని చెప్పారు. దీనిపై సునీత స్పందించాల్సి ఉంది.
- Advertisement -