Thursday, June 12, 2025
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్సింగర్ మంగ్లీ పుట్టినరోజు వేడుకల్లో గంజాయి కలకలం..

సింగర్ మంగ్లీ పుట్టినరోజు వేడుకల్లో గంజాయి కలకలం..

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: ప్రముఖ టాలీవుడ్ గాయని మంగ్లీ పుట్టినరోజు వేడుకలు వివాదాస్పదంగా మారాయి. మాదకద్రవ్యాల వినియోగం జరుగుతోందన్న పక్కా సమాచారంతో రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం పరిధిలోని త్రిపుర రిసార్టులో మంగళవారం రాత్రి జరిగిన ఈ వేడుకలపై పోలీసులు ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. ఈ సోదాల్లో పెద్ద మొత్తంలో గంజాయి ప్యాకెట్లు, ఖరీదైన విదేశీ మద్యం సీసాలు లభ్యమైనట్లు సమాచారం. దీంతో పార్టీలో ఉన్న పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారికి వైద్య పరీక్షలు నిర్వహించగా, కొందరికి డ్రగ్స్ పాజిటివ్‌గా తేలినట్లు వార్తలు వస్తున్నాయి. మొత్తంగా ప్రస్తుతానికి 9 మందికి పాజిటివ్ వచ్చినట్లు సమాచారం. అయితే ఇందులో మంగ్లీ పేరు ఉందో లేదో తెలియాల్సి ఉంది. మంగ్లీతోపాటు రిసార్టు నిర్వాహకులపై కూడా కేసు నమోదు కావడం గమనార్హం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -