Friday, August 8, 2025
E-PAPER
spot_img
Homeదర్వాజవారించలేమా….

వారించలేమా….

- Advertisement -

దేశాది నేతలకు యుద్ధం ఇప్పుడు
వీడియో గేమ్‌ ఆడినంత ఆనందం
జాతీయ వాదం నూక్లియర్‌ వాదం ఎదో ఒక వంక
తిండికి లేని దేశాలకు ఆధునిక ఆయుధాలు
సరఫరా పెద్ద రహస్యం ఏమీ కాదు కదా
అగ్ర రాజ్యాలకు అదొక వ్యాపార నైపుణ్యం
జనం చేయని నేరానికి శిక్ష జీవితాంతం
మనుషులు బంధాలు కోల్పోయి నరక యాతన
మరణాలు ఒక అంకె మాత్రమే ప్రభుత్వాలకు
కొన్ని యుద్ధలు సీరియల్‌ కు మించి
ఆగిపోతే ప్రజలు ఊపిరి ఆపేస్తారు అని భయం
మొదలు పెట్టడం వీజీనే ముగింపు ఎంతో తెగింపు కావలి మరి
వారించలేమా యుద్ధం చాలించలేమా
విశ్వశాంతిని మళ్ళీ వికసించలేమా
కంగారు పసిపిల్లలకు బంగారు భవిశ్వత్తు రాయలేమా
– దాసరి మోహన్‌, 9985309080

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img