Sunday, October 12, 2025
E-PAPER
Homeతాజా వార్తలుఎల్బీనగర్‌లో కారు బీభ‌త్సం..ప‌లువురికి తీవ్ర గాయాలు

ఎల్బీనగర్‌లో కారు బీభ‌త్సం..ప‌లువురికి తీవ్ర గాయాలు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: ఎల్బీనగర్‌లో థార్‌ వాహనం బీభత్సం సృష్టించింది. బీఎన్‌రెడ్డినగర్‌సమీపంలోని గుర్రంగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇంజాపూర్ నుంచి గుర్రంగూడ వైపు వేగంగా దూసుకొచ్చిన థార్ వాహనం అదుపు తప్పింది. అనంతరం, మొదట రోడ్డుపై వెళ్తున్న ఓ బైక్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ సందర్భంగా ఆ బైక్‌పై ప్రయాణిస్తున్న విద్యార్థినికి తీవ్ర గాయాలయ్యాయి.

ఆ త‌ర్వాత‌ మరో కారును ఢీ కొట్టింది. ఆ తర్వాత వాహనం గాల్లోకి లేచి మూడు పల్టీలు కొట్టి రోడ్డుపై పడిపోయింది. ఈ ప్రమాదంలో థార్ వాహనంలో ఉన్న డ్రైవర్‌తో పాటు యజమాని అనిరుధ్‌కు తలకు తీవ్ర గాయాలయ్యాయి. అలాగే, రెండో కారులో ప్రయాణిస్తున్న దినేష్, శివ అనే ఇద్దరు వ్యక్తులు కూడా గాయపడ్డారు. దీంతో, వీరిని స్థానిక ఆసుపత్రికి తరలించి.. చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -