Monday, March 30, 2026
E-PAPER
Homeతాజా వార్తలుబైక్‌ను ఢీకొట్టిన‌ కారు.. వ్య‌క్తి మృతి

బైక్‌ను ఢీకొట్టిన‌ కారు.. వ్య‌క్తి మృతి

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : ద్విచ‌క్ర వాహ‌నాన్ని కారు ఢీకొట్టిన దుర్ఘ‌ట‌న‌లో ఓ వ్య‌క్తి మ‌ర‌ణించాడు. ఈ విషాద సంఘ‌ట‌న న‌ల్ల‌గొండ జిల్లా గుడిప‌ల్లి మండ‌లం చిల‌క‌మర్రి గ్రామ పంచాయ‌తీ ప‌రిధి సంజీవ‌ని ట్ర‌స్ట్ వ‌ద్ద సోమ‌వారం మ‌ధ్యాహ్నం జ‌రిగింది. మృతుడిని పెద్దఅడిశ‌ర్ల‌ప‌ల్లి మండ‌లం అజ్మాపురం గ్రామానికి చెందిన మారుపాకుల‌ చెన్న‌కేశ‌వుల‌ గౌడ్‌గా గుర్తించారు. చెన్న‌కేశ‌వుల‌ గౌడ్ వృత్తిరీత్యా బోరు బండి నడిపిస్తున్నాడు. తన సొంత బోరు బండి జ‌డ్చ‌ర్ల‌-కోదాడ హై వే పై గ‌ల సంజీవని ట్ర‌స్ట్‌ దగ్గర ఆగి ఉండడంతో తాను రోడ్డు అవతల నిలబడి మాట్లాడుతుండగా ఒక్కసారిగా అతివేగంతో వచ్చిన TS07FU7315 గల మారుతి స్విఫ్ట్ కారు ఆ వ్యక్తిని బలంగా ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. చెన్న‌కేశ‌వులుకు ఒక బాబు, పాప ఉన్నారు. మృత‌దేహాన్ని 108 వాహనం ద్వారా దేవరకొండ ప్రభుత్వ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -