- Advertisement -
నవతెలంగాణ-హైదాబాద్ : చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం శేషాపురం హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు మృతి చెందారు. తిరుపతి-బెంగళూరు జాతీయ రహదారిపై శేషాపురం వద్ద ఈ ఘటన జరిగింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..
- Advertisement -



