- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అన్నదమ్ములు దుర్మరణం చెందారు. ఈ విషాదకర సంఘటన హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం ముప్పారంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. జనగామ జిల్లా తరిగొప్పుల మండలం నర్సాపూర్స్కు చెందిన ఓ కుటుంబం కారులో వెళుతుండగా అదుపు తప్పి చెట్టును ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ఇద్దరు సోదరులు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఐదుగురు గాయపడ్డారు. గమనించిన స్థానికులు క్షతగాత్రులను హాస్పిటల్కు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -



