Sunday, July 20, 2025
E-PAPER
Homeఖమ్మంఅదుపుతప్పి డివైడర్‌ను ఢీకొన్న కారు..

అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొన్న కారు..

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : ఖమ్మం రూరల్ మండలంలో ఆదివారం ఉదయం కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొన్న ఘటన చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, హైదరాబాద్‌ నుంచి ఖమ్మం దిశగా వస్తున్న కారు మద్దులపల్లి గ్రామ శివారులోని పెట్రోల్ బంక్ వద్ద ఉన్న మూల మలుపులో అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు డ్రైవర్‌తో పాటు కారులో ఉన్న ఇద్దరు మహిళలు గాల్లోకి ఎగిరి కింద పడ్డారు. అదృష్టవశాత్తూ వారిలో ఎవరికి ప్రాణాపాయం కలగలేదు. ఇద్దరు మహిళలు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి, గాయపడినవారిని ఆటోలో ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. క్షతగాత్రులు వరంగల్ క్రాస్ రోడ్‌కు చెందినవారిగా గుర్తించినట్లు సమాచారం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -