Sunday, January 18, 2026
E-PAPER
Homeతాజా వార్తలుఫిల్మ్ నగర్ లో పల్టీలు కొట్టిన కారు!

ఫిల్మ్ నగర్ లో పల్టీలు కొట్టిన కారు!

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : హైదరాబాద్‌లోని అత్యంత రద్దీ ప్రాంతాల్లో ఒకటైన ఫిల్మ్ నగర్‌లో ఓ కారు బీభత్సం సృష్టించింది. అధిక వేగంతో దూసుకొచ్చిన ఆ కారు, అదుపుతప్పి రోడ్డుపైనే బోల్తా పడింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ కావడంతో వెలుగులోకి వచ్చాయి.

వివరాల్లోకి వెళితే, ఫిల్మ్ నగర్ ప్రధాన రహదారిపై ఓ కారు అత్యంత వేగంగా ప్రయాణిస్తోంది. వేగం అదుపు చేయలేని స్థితికి చేరడంతో డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు. దీంతో కారు రోడ్డుపైనే పల్టీలు కొడుతూ తలకిందులుగా పడిపోయింది. ఈ ప్రమాద దృశ్యాలు చూస్తే వేగం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది.

ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఎంతమంది ప్రయాణిస్తున్నారనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. వారికి తగిలిన గాయాల వివరాలు కూడా తెలియాల్సి ఉంది. నిత్యం వాహనాల రాకపోకలతో రద్దీగా ఉండే ఫిల్మ్ నగర్‌లో ఈ ప్రమాదం జరగడంతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -