- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : నల్లగొండ జిల్లా ముదిగొండ గోకినేపల్లి అండర్ పాస్ ఫ్లైఓవర్ రహదారిపై ఘరో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రహదారిపై వేగంగా దూసుకొచ్చిన కారు రోడ్డుపై పల్టీ కొట్టింది. దీంతో కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -