- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: టాలీవుడ్ యువ హీరో రాజ్ తరుణ్‌పై మరోసారి కేసు నమోదైంది.రాజ్ తరుణ్ తనపై దాడి చేయించి, దోపిడీకి పాల్పడ్డారంటూ లావణ్య ఫిర్యాదు మేరకు నార్సింగి పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు. కోకాపేటలోని ఓ విల్లాలో తాను నివాసం ఉంటుండగా రాజ్ తరుణ్ పంపిన కొందరు వ్యక్తులు తనపై దాడికి పాల్పడ్డారని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. తనను దుర్భాషలాడుతూ, బెల్టులు, గాజు సీసాలతో విచక్షణారహితంగా కొట్టారని లావణ్య తెలిపింది. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు రాజ్ తరుణ్‌తో పాటు మణికంఠ తంబాడీ, రాజ్ శేఖర్, సుశి, అంకిత్ గౌడ్, రవితేజలపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
- Advertisement -