Sunday, February 8, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మద్యం అమ్మకాన్ని నిషేధాన్ని ఉల్లంఘించిన వ్యక్తిపై కేసు

మద్యం అమ్మకాన్ని నిషేధాన్ని ఉల్లంఘించిన వ్యక్తిపై కేసు

- Advertisement -

నవతెలంగాణ-మద్నూర్ : మద్నూర్ మండలంలోని అవల్గావ్ గ్రామంలో గ్రామ ప్రజల ఆరోగ్యాలను దృష్టిలో పెట్టుకొని గ్రామ ప్రజలంతా ఆ గ్రామంలో మద్యం అమ్మకాలను నిషేధిస్తూ ఏకగ్రీవంగా తీర్మానించుకొని మద్యం అమ్మకాలు జరగకుండా చూడాలని ఆ గ్రామ సర్పంచ్ నాయకత్వంలో ఇటీవల గ్రామస్తులు కలిసి ఎక్సైజ్ శాఖ, పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖ,లకు వినతి పత్రాలు అందించడం జరిగింది. గ్రామస్తుల తీర్మానాన్ని ఉల్లంఘిస్తూ గ్రామంలో ఒకరు మద్యం అమ్మకాలు జరుపుతుండగా ఎక్సైజ్ శాఖ అధికారులు శనివారం రాత్రి పట్టుకున్నట్లు తెలిసింది. ఈ విషయాన్ని నవ తెలంగాణ ఆదివారం ఎక్సైజ్ సీఐ సత్యనారాయణకు ఫోన్ ద్వారా అడిగి వివరణ కోరగా ఆ గ్రామంలో ఒక వ్యక్తి మద్యం అమ్మకాలు జరుపుతుండగా 40 క్వార్టర్లను పట్టుకున్నట్లు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -