- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: హైదరాబాద్ దుర్గం చెరువు కబ్జా వ్యవహారంలో బీఆర్ఎస్ దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డిపై మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. చెరువులో మట్టి నింపి, రాళ్లతో అక్రమంగా కబ్జా చేసి ప్రైవేట్ పార్కింగ్ దందా నిర్వహిస్తున్నట్లు హైడ్రా ఫిర్యాదు చేసింది. 2014 నుంచే ఈ కబ్జా పర్వం సాగుతోందని ఫిర్యాదులో పేర్కొంది. దీంతో ప్రభాకర్ రెడ్డి, వెంకటరెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -



