Thursday, September 18, 2025
E-PAPER
Homeతాజా వార్తలుదర్శకుడు రాంగోపాల్ వర్మపై కేసు నమోదు..

దర్శకుడు రాంగోపాల్ వర్మపై కేసు నమోదు..

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. ఆయన రూపొందించిన దహనం వెబ్ సిరీస్‌పై రిటైర్డ్ ఐపీఎస్ అధికారి అంజన సింహా చేసిన ఫిర్యాదు ఆధారంగా రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్టు సమాచారం.

వివరాల్లోకి వెళ్తే – మావోయిస్టులపై తెరకెక్కించిన ఈ వెబ్ సిరీస్‌లో అంజన సింహా పేరు ప్రస్తావన రావడం, అలాగే ఆయన చెప్పిన విధంగా కొన్ని సన్నివేశాలు తీశామని వర్మ ఇంటర్వ్యూలో పేర్కొనడం పెద్ద వివాదానికి దారి తీసింది. దీనిపై స్పందించిన అంజన సింహా, “నా అనుమతి లేకుండా, నా ప్రమేయం లేకుండా నా పేరు వాడటం చట్టవిరుద్ధం” అని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు రాంగోపాల్ వర్మపై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే వర్మ సినిమాలు, వెబ్ కంటెంట్ తరచూ వివాదాలు రేపుతున్న నేపథ్యంలో ఈ ఘటన మరోసారి ఆయనను చర్చలోకి తెచ్చింది. ఇక ‘దహనం’ వెబ్ సిరీస్‌కి సంబంధించి రాబోయే రోజుల్లో మరిన్ని పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -