Monday, July 21, 2025
E-PAPER
Homeజాతీయంకర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే కుమారుడిపై లైగింక దాడి కేసు న‌మోదు

కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే కుమారుడిపై లైగింక దాడి కేసు న‌మోదు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: కర్ణాటక మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే అయిన ప్రభు చౌహాన్ కుమారుడు ప్రతీక్ చౌహాన్‌పై లైగింక దాడి కేసు నమోదైంది. బీదర్ మహిళా పోలీస్ స్టేషన్‌లో ఒక మహిళ ఫిర్యాదు మేరకు కేసు బుక్ చేశారు. పదేపదే అత్యాచారం, నేరపూరిత బెదిరింపులు, దాడికి పాల్పడినట్లు ఆరోపించింది. ఫిర్యాదు ప్రకారం, డిసెంబర్ 25, 2023లో సదరు బాధిత మహిళతో ప్రతీక్ చౌహాన్ ఎంగేజ్మెంట్ జరిగింది. నిశ్చితార్థం తరువాత పెళ్లి హామీతో పలుమార్లు మహిళపై అత్యాచారం చేసినట్లు ఆరోపించింది.

బెంగళూర్, లాతూర్(మహారాష్ట్ర), షిర్డీలోని పలు ప్రైవేట్ హోటళ్లలో తనపై అనేక సార్లు అత్యాచారం చేశాడని బాధితురాలు పేర్కొంది. లైంగిక చర్యలో పాల్గొనకుంటే పెళ్లి రద్దు చేసుకుంటానని బెదిరించినట్లు వెల్లడించింది. కనీసం మూడు సార్లు తనను లాతూర్ తీసుకెళ్లాడని, అక్కడే బలవంతం చేసినట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొంది. జూలై5, 2025న మహిళ, తన కుటుంబంతో పెళ్లి తేదీని నిర్ణయించుకోవడానికి వెళ్లిన సందర్భంలో, తాము ఈ పెళ్లికి అంగీకరించడం లేదని ఎమ్మెల్యే కుటుంబీలుకు చెప్పినట్లు ఆరోపించింది. మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు ప్రతీక్ చౌహన్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -