Tuesday, March 31, 2026
E-PAPER
Homeజాతీయంటీవీకే అధినేత‌పై కేసు న‌మోదు

టీవీకే అధినేత‌పై కేసు న‌మోదు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ చీఫ్‌ విజయ్‌కు ఎన్నికల సంఘం షాకిచ్చింది. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినందుకు విజయ్‌పై ఈసీ కేసు నమోదు చేసింది. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ ఉల్లంఘించినందుకు పెరావల్లూర్ పోలీస్ స్టేషన్‌లో విజయ్‌పై కేసు నమోదైంది. ఒక పబ్లిక్ మీటింగ్ సందర్భంగా రూల్స్ అతిక్రమించినందుకుగాను, ఫ్లయింగ్ స్క్వాడ్ ఆఫీసర్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు విజయ్‌పై కేసు రిజిష్టర్ చేసినట్లు తెలుస్తోంది. తమిళనాడులో ఏప్రిల్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.

ఇక, విజయ్ ఇప్పటికే తన ఆస్తులకు సంబంధించిన అఫిడవిట్ సమర్పించారు. తనకు రూ.603 కోట్ల స్థిర, చర ఆస్తులున్నట్లు వెల్లడించారు. ఈ ఎన్నికల్లో విజయ్ పార్టీ టీవీకే ఒంటరిగానే పోటీ చేస్తోంది. అన్ని స్థానాలకు ఆయన అభ్యర్థుల్ని ప్రకటించారు. తమిళనాడులోనే కాకుండా, పుదుచ్చేరికి కూడా అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. టీవీకే పార్టీకి ఇవే తొలి ఎన్నికలు.234 అసెంబ్లీ స్థానాలున్న తమిళనాడులో ఏప్రిల్ 23న ఎన్నికలు జరగబోతున్నాయి. మే 4న ఫలితాలు వెల్లడవుతాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -