Monday, November 3, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బాల్య వివాహా భాగస్వాములందరిపై కేసులు

బాల్య వివాహా భాగస్వాములందరిపై కేసులు

- Advertisement -

నవతెలంగాణ-వనపర్తి
బాల్య వివాహాలు చేస్తే అందులో భాగస్వాములైన ప్రతి ఒక్కరి పై చట్టరీత్య కేసులు నమోదు చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అమ్మాయిలు 18 సంవత్సరాల వయస్సు పూర్తి అయ్యే వరకు వారిని ఖచ్చితంగా చదివించాలని, చదువులు పూర్తి అయ్యాక తనంతట తాను నిర్ణయాలు తీసుకొనే దశకు వచ్చినపుడు సంతోషంగా వివాహం జరిపించుకోవచ్చని, అలాకాకుండా 18 సంవత్సరాల లోపే పెళ్ళి చేస్తే అందులో భాగస్వాములైన ప్రతి ఒక్కరిపై కేసు నమోదు చేయడం జరుగుతుందని హెచ్చరించారు. బాల్య వివాహ నిషేధ చట్టం- 2006 ప్రకారంగా అమ్మాయిలకు 18 సంవత్సరాలు, అబ్బాయిలకు 21 సంవత్సరాల వయస్సు నిండకుండా పెళ్లి చేస్తే చట్టరీత్యా నేరం అవుతుందన్నారు. ఈ చట్టం ప్రకారం బాల్య వివాహానికి అనుమతినిచ్చినా, ప్రోత్సహించిన, వివాహాన్ని నిర్వహించినా, బాల్య వివాహానికి హాజరైన వారందరినీ నిందితులు గానే పరిగణింపబడతారన్నారు. ఈ నేరానికి బాల్యవివాహా నిషేధ చట్టం 2006 సెక్షన్స్ 9, 10, 11(1), 13(10) ప్రకారం గరిష్టంగా” 2 సంవత్సరాల “జైలు శిక్ష లేదా లక్ష రూపాయల వరకు జరిమానా” లేదా రెండు విధించబడతాయని తెలిపారు. ఇది “నాన్ బెయిలబుల్ నేరమనీ తెలియజేశారు. బాల్య వివాహాలను అరికట్టడానికి చట్టం ప్రకారం గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకూ జిల్లా స్థాయిలో-జిల్లా కలెక్టర్, డివిజనల్ స్థాయిలో-ఆర్డీవో /సబ్ కలెక్టర్, ప్రాజెక్టు స్థాయిలో సిడిపిఓ, మండల స్థాయిలో-తహసిల్దార్, సెక్టార్ స్థాయిలో సూపర్వైజర్, గ్రామ స్థాయిలో పంచాయతీ కార్యదర్శి/వీఆర్వో బాలల వివాహా నిషేధ అధికారులు (సి.ఎం.పి.వో)Child Marriage Prohibition Officers) గా వ్యవహరిస్తారని తెలిపారు.

ఎక్కడైనా బాల్య వివాహం జరిపించడానికి ప్రయత్నం చేసినట్లయితే వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. చైల్డ్ లైన్ 1098 లేదా 100 పోలీస్ కు ఫోన్ చేసి తెలియజేయాలని సూచించారు. ఇటీవల ఘనపూర్ మండలం, వెంకటాం పల్లి గ్రామంలో బాల్య వివాహాన్ని అడ్డుకొని అమ్మాయి, అబ్బాయి తల్లిదండ్రుల పైన, ఫంక్షన్ హాల్ యజమాని పైన, పెళ్ళి చేయడానికి వచ్చిన పూజారి పైన సైతం కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగుతున్నట్లు తెలిపారు. తల్లిదండ్రులు, కుల పెద్దలు, పూజారులు ప్రతి ఒక్కరూ బాల్య వివాహాలకు మద్దతు ఇవ్వవద్దని, చట్టాన్ని అమలు చేసేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేసి ఆరోగ్యవంతమైన సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -