నవతెలంగాణ – మద్నూర్
కెజ్విల్ ట్రాక్టర్లు బిటి రోడ్ల పైన నడపకూడదని మట్టి రోడ్ల పైన వ్యవసాయ పనులకు వాడడం ఉపయోగించాలి. కానీ బీటీ రోడ్ల పైన నడుపుతే చట్టరీత్యా నేరమని కేసులు నమోదు చేయవలసి వస్తుందని తెలంగాణ రాష్ట్ర సరిహద్దు మద్నూర్ మండలంలోని సలాబత్పూర్ ఆర్టీవో శాఖ చెక్పోస్ట్ ఇంచార్జ్ అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కే శ్రీనివాస్ హెచ్చరికలు జారీ చేశారు. జిల్లా వ్యాప్తంగా అవగాహన సదస్సులో భాగంగా రోడ్లపై వెళ్తున్న కేజ్విల్ ట్రాక్టర్లు నడిపే రైతులను ఆపి వారికి అవగాహన కల్పిస్తూ చట్ట విరుద్ధంగా బీటీ రోడ్లపై ఇలాంటి వాహనాలు నడపకూడదని తెలియజేశారు. బీటి రోడ్లు కేజ్విల్ వాహనాలు నడుపుతే చెడిపోవడం నాశనం కావడం జరుగుతుందని అలాంటి చట్ట విరుద్ధం పనులు చేయకూడదని మట్టి రోడ్లపైనే నడపాలని ఆయన ట్రాక్టరు వాహనదారులకు సూచించారు. రోడ్లపై నడిపితె కేసులు నమోదు చేస్తానని హెచ్చరించారు.
బీటీ రోడ్ల పైన కెజ్విల్ ట్రాక్టర్లు నడుపుతే కేసులు నమోదు చేస్తాం: కే శ్రీనివాస్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES