Friday, May 30, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ధాన్యం తరలించిన మూడు రోజులలో రైతుల ఖాతాలలో నగదును జమ అవుతుంది

ధాన్యం తరలించిన మూడు రోజులలో రైతుల ఖాతాలలో నగదును జమ అవుతుంది

- Advertisement -

నవతెలంగాణ – తొగుట
రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధి కారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా అడి షనల్ కలెక్టర్ గరిమా అగ్రవాల్ సూచించారు. బుధ వారం మండలంలోని ఎల్లారెడ్డిపేట గ్రామ సమీపం లో ఉన్న ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని అడిషనల్ కలెక్టర్ పరి శీలించారు. అనంతరం  మాట్లాడుతూ రైతులెవరు అధైర్య పడవద్దని ప్రభుత్వం చిట్టచివరి గింజ వర కు కొనుగోలు చేస్తుందని హామీ ఇచ్చారు. కొను గోలు కేంద్రంలో ఎలాంటి ఇబ్బందులు ఉన్న అధి కారుల దృష్టికి తీసుకురావాలని రైతులకు సూచిం చారు. ధాన్యం సేకరించి మిల్లర్లకు తరలించిన రెండు, మూడు రోజులలో రైతుల ఖాతాలలో నగ దును జమ అవుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నందున రైతులందరు ధాన్యం పై టార్పాలిన్ కవర్లు ఏర్పాటు చేసి ధాన్యం తడవ కుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. హార్వె స్టింగ్ చేయని వరి పంటను సాధ్యమైనంత వరకు రైతులు త్వరగా హార్వెస్టింగ్ చేసి కొనుగోలు కేంద్రా లకు తీసుకువచ్చే ఏర్పాటు చేసుకోవాలన్నారు. రానున్న మూడు, నాలుగు రోజులలో భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో రైతులందరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిపి ఎం కరుణాకర్, తహసిల్దార్ శ్రీకాంత్, ఎంపీడీవో శ్రీనివాస్ రెడ్డి, వ్యవసాయ అధికారి మోహన్, ఏపీ ఎం శ్రీనివాస్, ఏపీవో నరసింహారెడ్డి, ఏఈఓ నాగా ర్జున, ఐకెపి సిబ్బంది, రైతులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -