నవతెలంగాణ-హైదరాబాద్: రానున్న జనగణనలో కులగణన కూడా చేర్చాలని నిర్ణయించినట్లు కేంద్రం బుధవారం ప్రకటించింది. కేబినెట్ సమావేశం తర్వాత ఆ వివరాలను కేంద్ర మంత్రి అశ్వనీ వైష్ణవ్ మీడియాకు వివరించారు. తదుపరి చేపట్టనున్న జనగణనలో కులగణనను కూడా చేర్చాలని ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన రాజకీయ వ్యవహారాల కేబినెట్ కమిటీ నిర్ణయించినట్లు తెలిపారు. అదే సమయంలో ఇండియా కూటమిపై విమర్శలు గుప్పించారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత నుండి చేపట్టిన జనగణనలో కులగణన భాగం కాలేదని, 2010లో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ (లేటు) లోక్‌సభలో కులగణనను కేబినెట్ అంశంగా పరిగణిస్తామని హామీ ఇచ్చారు. మంత్రుల బృందాన్ని కూడా ఏర్పాటు చేశారు. చాలా రాజకీయ పార్టీలు కులగణనను సిఫారసు చేశాయి. కానీ అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కులగణనకు బదులుగా కులసర్వేను మాత్రమే నిర్వహించాలని నిర్ణయించిందని, ఈ సర్వేను ఎస్‌ఇసిసి అంటారని చెప్పుకొచ్చారు.
రానున్న జనగణనలో కులగణన..!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES