– దేశంలో వైషమ్యాలను పెంచేందుకు కుట్ర
– ప్రకృతి ప్రసాదించిన వైవిధ్య భారతాన్ని నిర్మిద్దాం :
– ప్రొఫెసర్ జయశంకర్ స్మారకోపన్యాసంలో సినీ నటుడు ప్రకాశ్‌రాజ్
– విశ్వవిద్యాలయాలు స్వయంప్రతిపత్తి కోల్పోతున్నాయి : ప్రొఫెసర్ హరగోపాల్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్ : దేశంలో హిట్లర్ వారసుల పాలన కొనసాగు తోందనీ, వారి పట్ల ప్రజాస్వామ్య, లౌకికవాదులు అప్రమత్తంగా ఉండాలని ప్రముఖ సినీ నటుడు ప్రకాశ్‌రాజ్ పిలుపునిచ్చారు. తెలంగాణ వికాస సమితి ఆధ్వర్యంలో ”వైషమ్యాల సుడిలో వైవిధ్య భారతం” అనే అంశంపై శనివారం హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఫ్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ స్మారకోపన్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమానికి ప్రకాశ్‌రాజ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. దేశంలో విభిన్న మతాలు, కులాలు, జాతుల మధ్య వైషమ్యాలు పెంచి పోషిస్తూ అధికార పీఠాన్ని సుస్థిరం చేసుకునే ందుకు చేస్తున్న కుట్రలను తిప్పికొట్టాలని పిలుపుని చ్చారు. ఆకలి, నిరుద్యోగం, అవినీతి, అక్రమాలు తదితర సమస్యలను కప్పిపుచ్చే క్రమంలో ధర్మం, కులం, జాతి ప్రమాదంలో పడ్డాయంటూ ప్రజలను ఎమోషనల్ బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని ఆక్షేపించారు. వాటన్నింటి రక్షించే కాంట్రాక్ట్ తమకే ఇవ్వాలంటూ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని విమర్శించారు. కొంతమందికి జెనోఫోబియా అనే వ్యాధి పట్టుకుందనీ, వాడు మనవాడు కాదు, వీడు మన జాతి వాడు కాదంటూ నేటి తరం నరనరాల్లో విషాన్ని నింపుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వాట్సాప్ యూనివర్సిటి లాంటి ప్రచార మాధ్యమాల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టు చరిత్రను వక్రీకరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేరళ ఫైల్స్, నిజాం ఫైల్స్ లాంటి సినిమాలు ఆ కోవలోనివేనని గుర్తుచేశారు. బ్రిటీష్ పాలకులు అనుసరించిన విభజించు పాలించు విధానాన్ని అమలు చేసేందుకు అన్ని సాధనాలను వాడుకుంటున్నారని విమర్శించారు. ప్రస్తుతం దేశంలో కమ్యూనల్, టారిఫ్ వార్‌లు నడుస్తున్నాయని వ్యాఖ్యానించారు. తమను తాము కాపాడుకునేందుకు పాకిస్తాన్, ముస్లింలు, ఆపరేషన్ సిందూర్, పుల్వామా లాంటి ఘటనలను నిత్యం సృష్టిస్తున్నారని ఆరోపించారు. ప్రజలను విడగొట్టేందుకు దేశాన్ని పాలిస్తున్న మహాప్రభువులు చేస్తున్న కుట్రలు, కుతంత్రాలను యువత తిప్పికొట్టాలని పిలునిచ్చారు. కులం, మతం, భాష లేకుండా ప్రకృతిలో అనేక జంతు, జీవ రాశులు జీవిస్తున్నాయనీ, వాటిని ఆదర్శంగా తీసుకొని మనిషి మనిషిగా బతకాలని హితవు పలికారు. ”మట్టిపనికైనా మనవాడే కావాలి.
వెలుగుతున్న జ్యోతికన్నా వెలిగించిన అగ్గిపుల్లే గొప్పది. తెలంగాణ ఉద్యమాన్ని వెలిగించి సాకారం చేసిన అగ్గిపుల్ల ఫ్రొఫెసర్ జయశంకర్. చివరి వరకు పరమత సహనాన్ని పాటించిన వ్యక్తి. ఆయన స్ఫూర్తితో కులమతాలకతీతంగా సహజీవనం సాగించాలి” అని ప్రకాశ్‌రాజ్ ఈ సందర్భంగా సూచించారు. ఫ్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ ఒకప్పుడు ప్రజా చైతన్యానికి ప్రతీకలుగా ఉన్న విశ్వవిద్యాలయాలు క్రమంగా తమ స్వయంప్రతిపత్తిని కోల్పోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వీసీగా ఉన్న కాలంలో జయశంకర్ కాకతీయ యూనివర్సిటీని గొప్ప విద్యాకేంద్రంగా తీర్చిదిద్దారని కొనియాడారు. ఒక వైపు తెలంగాణ ఉద్యమకారుడిగా, మంచి విద్యావేత్తగా పాఠాలు చెబుతూ చివరి వరకు నిబద్దతతో పని చేశారని గుర్తు చేశారు. ప్రముఖ కవి అంపశయ్య నవీన్, ఫ్రొఫెసర్ శివలింగ ప్రసాద్, శ్రీధర్ దేశ్‌పాండేలకు జయశంకర్ స్ఫూర్తి అవార్డులను ఈ సందర్భంగా ప్రకాశ్‌రాజ్, హరగోపాల్ చేతుల మీదుగా అందజేశారు.
హిట్లర్ వారసులతో అప్రమత్తత అవసరం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES