Thursday, May 29, 2025
Homeజాతీయంసిబిఐ డైరెక్టర్‌ ప్రవీణ్‌ సూద్‌ పదవీకాలం పొడిగింపు

సిబిఐ డైరెక్టర్‌ ప్రవీణ్‌ సూద్‌ పదవీకాలం పొడిగింపు

- Advertisement -

నవతెలంగాణ న్యూఢిల్లీ :  కేంద్ర దర్యాప్తు సంస్థ ( సిబిఐ ) డైరెక్టర్‌ ప్రవీణ్‌ సూద్‌ పదవీకాలాన్ని కేంద్ర ప్రభుత్వం బుధవారం ఒక సంవత్సరం పొడిగించింది. ప్రధాని మోడీ నేతృత్వంలోని భారత ప్రధాన న్యాయమూర్తి సంజీవ్‌ ఖన్నా, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీలతో కూడిన ఎంపిక కమిటీ సోమవారం నిర్వహించిన సమావేశంలో సిబిఐ డైరెక్టర్‌ పదవీకాలాన్ని పొడిగించాలని నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఎంపిక కమిటీ సిఫారసుల ఆధారంగా, కేబినెట్‌ నియామకాల కమిటీ (ఎసిసి) ఏడాది పాటు ఆయన పదవీకాలాన్ని పొడిగించేందుకు ఆమోదం తెలిపింది. 2023 మే 25న ఆయన రెండేళ్ల కాలానికి సిబిఐ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు.
ప్రవీణ్‌ సూద్‌ కర్ణాటక కేడర్‌కి చెందిన 1986 బ్యాచ్‌ ఇండియన్‌ పోలీస్‌ సర్వీస్‌ (ఐపిఎస్‌) అధికారి. ఆయనను సిబిఐ డైరెక్టర్‌గా నియమించిన సమయంలో కర్ణాటక డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ (డిజిపి)గా విధులు నిర్వహిస్తున్నారు. 1964లో హిమాచల్‌ ప్రదేశ్‌లోని కాంగ్రా జిల్లాలో జన్మించిన ప్రవీణ్‌ సూద్‌ ఢిల్లీలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ నుండి సివిల్‌ ఇంజనీరింగ్‌ పూర్తి చేశారు. అనంతరం ఐపిఎస్‌ అధికారిగా బాధ్యతలు చేపట్టారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -