- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఉత్కంఠగా ఎదురుచూస్తోన్న సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 12వ తరగతి ఫలితాలు వెలువడ్డాయి. మంగళవారం ఉదయం బోర్డు ఈ రిజల్ట్స్ ప్రకటించింది. cbse.gov.in, cbseresults.nic.in/ వెబ్‌సైట్‌ల ద్వారా విద్యార్థులు తమ ఫలితాలను తెలుసుకోవచ్చు అని బోర్డు అధికారు తెలిపారు. 12వ తరగతిలో 83.39శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఫలితాల్లో బాలుర కంటే బాలికలే పైచేయి సాధించారు. అమ్మాయిల్లో 91.64శాతం, అబ్బాయిల్లో 85.70 శాతం మంది పాసయ్యారు. అత్యధికంగా విజయవాడలో 99.60శాతం ఉత్తీర్ణత నమోదైంది.అత్యల్పంగా ప్రయాగ్‌రాజ్‌లో 79.53శాతం మంది పాసయ్యారు.
- Advertisement -