Tuesday, May 13, 2025
Homeతాజా వార్తలుసీబీఎస్‌ఇ ప‌దో త‌ర‌గ‌తి ఫ‌లితాలు విడుద‌ల‌

సీబీఎస్‌ఇ ప‌దో త‌ర‌గ‌తి ఫ‌లితాలు విడుద‌ల‌

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఇ) ప‌దో తరగతి ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. మొదట 12వ తరగతి ఫలితాలు విడుదల చేసిన బోర్డ్‌ కొన్ని గంటల తర్వాత 10వ తరగతి ఫలితాలను విడుదల చేసింది. ఈ ఏడాది 10వ తరగతిలో మొత్తం ఉత్తీర్ణత శాతం 93.66గా ఉంది. ఈ ఏడాది ఫిబ్రవరి 15 నుండి ఏప్రిల్‌ 4 వరకు నిర్వహించిన పరీక్షలకు సుమారు 42 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. 10వ తరగతి పరీక్షలు మార్చి 18నుండి ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఫలితాల కోసం cbse.gov.in, cbseresults.nic.in, and results.cbse.nic.in. వెబ్‌సైట్‌లను సందర్శించాలి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -