నవతెలంగాణ – హైదరాబాద్ : 12వ తరగతి బోర్డ్ పరీక్షలను రద్దు చేస్తున్నట్లు సెంట్రల్ బోర్డ్ ఫర్ సెకండరీ ఎడ్యుకేషన్ ( సిబిఎస్‌ఇ) ఆదివారం ప్రకటించింది. అమెరికా, ఇజ్రాయిల్‌ల దాడులు, ఇరాన్ ప్రతీకార దాడులతో ఈ ప్రాంతంలో కొనసాగుతున్న సంక్షోభం కారణంగా, మధ్యప్రాచ్య దేశాల్లో అన్ని 12వతరగతి బోర్డు పరీక్షలను రద్దు చేస్తున్నట్లు సిబిఎస్‌ఇ తెలిపింది. మార్చి 16 నుండి ఏప్రిల్ 10వరకు జరగాల్సిన 12వతరగతి పరీక్షలు బహ్రెయిన్, ఇరాన్, కువైట్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా మరియు యుఎఇ నుండి వచ్చిన విద్యార్థులకు రద్దు చేయనున్నట్లు పేర్కొంది. గతంలో వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన 12వ తరగతి బోర్డు పరీక్షలు కూడా రద్దు చేయబడతాయని తెలిపింది. ఫిబ్రవరి 17 నుండి మార్చి 11 వరకు 10వ తరగతి పరీక్షలను నిర్వహించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. గతంలో వాయిదా వేసినట్లు ప్రకటించిన పరీక్షలను కూడా రద్దు చేసినట్లు సిబిఎస్‌ఇ బోర్డ్ తెలిపింది.
సిబిఎస్‌ఇ 12వ తరగతి బోర్డు పరీక్షలు రద్దు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



