న్యూఢిల్లీ : కొత్త విద్యా సంవత్సరాని (2026-27)కి కొత్త సిలబస్‌ను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) ప్రకటించింది. దీని ప్రకారం, ఆరవ తరగతి నుంచి త్రి బాషా సూత్రాన్ని దశలవారీగా అమలు చేస్తోంది. అలాగే 9వ తరగతి నుంచి రెండు స్థాయిల్లో లెక్కలు, సైన్స్‌ను బోధించనున్నారు. కొత్త విద్యా విధానం (ఎన్‌ఈపీ) ప్రకారం 2026 నుంచి ఆరవ తరగతి విద్యార్ధులకు త్రి భాషా సూత్రాన్ని అమలు చేస్తారు. అలాగే 9వ తరగతి విద్యార్ధులకు లెక్కలు, సైన్స్‌లో స్టాండర్డ్, ఆప్షనల్ అడ్వాన్స్‌డ్ కోర్సులు వుంటాయి. విద్యార్ధులు తప్పనిసరిగా స్టాండర్డ్ పరీక్ష రాయాలి, అడ్వాన్స్‌డ్ పేపర్ మాత్రం ఆప్షనల్‌గా వుంటుంది. కావాలంటే రాయవచ్చు లేదా మానేయవచ్చునని అధికారులు చెప్పారు.
ఈ విద్యా సంవత్సరానికి సీబీఎస్‌ఈ కొత్త సిలబస్
- Advertisement -
- Advertisement -



