Friday, November 21, 2025
E-PAPER
Homeబీజినెస్విద్యార్థుల సరికొత్త ఆవిష్కరణలకు వేదికగా సీడీఎస్ఎల్ ఐడియాథాన్‌

విద్యార్థుల సరికొత్త ఆవిష్కరణలకు వేదికగా సీడీఎస్ఎల్ ఐడియాథాన్‌

- Advertisement -

నవతెలంగాణ ముంబై: ఆసియాలోనే తొలి లిస్టెడ్ డిపాజిటరీ, 16.7 కోట్ల డీమ్యాట్ ఖాతాలకు విశ్వసనీయమైన కస్టోడియన్‌గా వ్యవహరిస్తున్న సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ (ఇండియా) లిమిటెడ్ (సీడీఎస్ఎల్), కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించే దిశగా విద్యార్థుల కోసం వినూత్నంగా తొలి ఐడియాథాన్‌ని ఆవిష్కరించింది. ఫ్లాగ్‌షిప్ సీడీఎస్ఎల్ యాన్యువల్ రీఇమేజిన్ సింపోజియం 3వ ఎడిషన్ కింద రీఇమేజిన్ ఐడియాథాన్‌కి శ్రీకారం చుట్టింది.

మార్కెట్లను మరింత సమ్మిళితత్వమైనవిగా, మరింత మంది ఇన్వెస్టర్లు పాలుపంచుకునే విధంగా మార్చే దిశగా భారతీయులు నేర్చుకునే, ఇన్వెస్ట్ చేసే, వృద్ధిలోకి వచ్చే ప్రక్రియను సరికొత్తగా తీర్చిదిద్దే సొల్యూషన్స్‌ని రూపొందించడంలో ప్రతిభావంతులైన యువతను భాగస్వాములను చేయడమనేది ఐడియాథాన్ లక్ష్యం. డిపాజిటరీ వ్యవస్థ 21 కోట్లకు పైగా ఇన్వెస్టర్ల డీమ్యాట్ ఖాతాల అసెట్స్‌ను సురక్షితంగా ఉంచుతోంది. సెక్యూరిటీస్ మార్కెట్ విస్తరణకు, ఈ వృద్ధి గాథ ప్రయోజనాలను పొందడంలో ఇన్వెస్టర్లకు ఎదురవుతున్న అవరోధాలను తొలగించేందుకు గణనీయంగా అవకాశాలు ఉన్నాయి.

సెబీ , ఆర్‌బీఐలాంటి నియంత్రణ సంస్థలు చేపట్టిన చర్యలకు కొనసాగింపుగా, ఆర్థిక రంగ పరిధిలోకి మరింత మందిని తీసుకురావడానికి సంబంధించి తమ ఆలోచనా ధోరణులను పంచుకునేలా యువ ఆవిష్కర్తలను ప్రోత్సహించే ప్రయత్నాల్లో సీడీఎస్ఎల్ కూడా భాగస్వామిగా మారింది.

ఇన్వెస్టర్లలో అవగాహన పెంపొందించడం, వారు భారీ స్థాయిలో, బాధ్యతాయుతంగా పాలుపంచుకునేలా ప్రోత్సహించడం ద్వారా మార్కెట్లను అందరికీ అందుబాటులోకి తేవాలనేది ఈ కార్యక్రమం లక్ష్యం. ఇందులో పాల్గొనేవారు గేమిఫికేషన్, కమ్యూనికేషన్, డిజైన్, టెక్నాలజీ లేదా కమ్యూనిటీ బిల్డింగ్ లేదా ప్రవర్తనా ధోరణుల్లో మార్పులు తేవడంలాంటి తమకిష్టమైన మార్గాల్లో పరిష్కారాలను కనుగొనవచ్చు. ఈ సొల్యూషన్‌లో ప్రధానంగా మూడు గుణాలు ఉండాలి. అవేమిటంటే: సాధికారత, సమ్మిళితత్వం , విశ్వసనీయత.

“బాధ్యతాయుతమైన ఆవిష్కరణలను ప్రోత్సహించే విధంగా రీఇమేజిన్ ఐడియాథాన్ ఉంటుంది. ఎప్పటికప్పుడు మారిపోతున్న మార్కెట్లో టెక్నాలజీ అనేది ఒక ఉత్ప్రేరకంలాగా పని చేస్తుంది. సరైన సాధనాలు, విశ్లేషణలతో ఇన్వెస్టర్లకు సాధికారత కల్పిస్తుంది. సెక్యూరిటీస్ మార్కెట్ అనేది సమ్మిళితమైనదిగా, ప్రతి ఇన్వెస్టరుకు అందుబాటులో ఉండాలి. జాతి నిర్మాణంపై, ఇన్వెస్టర్లకు సాధికారత కల్పించడంపై సీడీఎస్ఎల్‌కి గల నిబద్ధతకు ఐడియాథాన్ నిదర్శనంగా నిలుస్తుంది. వివేకవంతమైన ఇన్వెస్టరే, సురక్షితంగా ఉండగలుగుతారు. పూర్తి వివరాల దన్నుతో తమ ఆకాంక్షలకు అనుగుణంగా, తగిన నిర్ణయాలు తీసుకోగలిగే సాధికారత కలిగి ఉంటారు. ఆ విధమైన భవిష్యత్తును తీర్చిదిద్దడంలో పాలుపంచుకోవాలని విద్యార్థులను ఆహ్వానిస్తున్నాం” అని సీడీఎస్ఎల్ మేనేజింగ్ డైరెక్టర్ & సీఈవో Mr. నేహల్ వోరా తెలిపారు.

వినూత్నతకు, సృజనాత్మకతకు పట్టం కట్టే విధంగా ఐడియాథాన్ కింద మొత్తం రూ. 11.5 లక్షల బహుమతులు ఉంటాయి. ఇందులో విజేతగా నిల్చే ఐడియాకు రూ. 5 లక్షలు, రన్నర్స్-అప్‌లకు రూ. 3 లక్షలు , రూ. 2 లక్షలు, నాలుగు , అయిదో స్థానాలకు చెరి రూ. 75,000 చొప్పున బహుమతులు ఉంటాయి.

ఐడియాథాన్ 2025కి రిజిస్ట్రేషన్లు 2025 నవంబర్ 19న ప్రారంభమవుతాయి. నలుగురి వరకు విద్యార్థులు, ఒక మెంటార్ (అదే సంస్థ నుంచి) జట్టుగా ఏర్పడి పాల్గొనవచ్చు. ప్రోబ్లం స్టేట్‌మెంట్, ఎవాల్యుయేషన్, టైమ్‌లైన్‌లు మొదలైన వివరాలను https://ideathon.cdslindia.లో చూడవచ్చు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -