- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: థాయ్‌లాండ్-కంబోడియా దేశాల మధ్య తలెత్తిన సరిహద్దు వివాదాలు యుద్ధానికి దారితీసిన విషయం తెలిసిందే. పలు రోజుల నుంచి రెండు దేశాల ఆర్మీ బలగాలు వైమానిక దాడులకు తెగబడ్డాయి. తాజాగా ఇరు దేశాల మధ్య చర్చల ద్వారా యుద్ధానికి ముగింపుపలికాయి. కాల్పుల విరమణకు అంగీకరిస్తున్నట్లు రెండు దేశాలు సంయుక్తంగా ప్రకటించాయి. ఆయుధాలు వాడకంపై తాత్కాలికంగా నిషేధం విధిస్తూ ఇరు దేశాల రక్షణమంత్రులు ప్రకటించారు. డిసెంబర్ 27 మధ్యాహ్నం 12 గంటల నుంచి కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి రానుంది. రెండు దేశాల అధ్యక్షులు ట్రంప్ సమక్షంలో సంతకాలు కూడా చేశారు. మొత్తానికి 20 రోజుల తర్వాత రెండు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయి.
- Advertisement -



