నవతెలంగాణ-హైదరాబాద్: ఇరాన్-అమెరికా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం భారతీయ స్టాక్ మార్కెట్ లాభాల బాట పట్టింది. బుధవారం, ఎస్ అండ్ పీ బీఎస్ఈ సెన్సెక్స్ ఏకంగా 2,946.32 పాయింట్లు లాభపడి, 77,562.90 పాయింట్ల వద్ద ముగిసింది. అలాగే, ఎన్ఎస్ఈ నిఫ్టీ కూడా ఏకంగా 873.35 పాయింట్లు పెరిగి, 23,997.35 పాయింట్ల వద్ద ముగిసింది. ఏకంగా ఈ ఒక్కరోజే 4 శాతం లాభాలతో మదుపర్ల సంపద రూ.17.1 లక్ష కోట్ల వరకు పెరిగింది.
మరోవైపు డాలర్‌తో రూపాయి మారక విలువ 47 పైసలు పెరిగి, 92.59 వద్ద కొనసాగుతోంది. కాల్పుల విరమణ ఒప్పందంతో అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు ఒక్కసారిగా భారీగా తగ్గిపోయాయి. అంతకుముందు రోజు బ్యారెల్ క్రూడాయిల్ ధర దాదాపు 109 డాలర్ల వద్ద ఉండగా, బుధవారం భారీగా తగ్గి 94 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. దాదాపు 16 శాతం పైగా చమురు ధర తగ్గింది. ఔన్స్ బంగారం ధర 4788 డాలర్ల వద్ద స్థిరపడింది. ఈ రోజు షేర్లలో ఇండిగో ఏకంగా పది శాతం మేర లాభాలు పొందింది.



