నవతెలంగాణ – నిజామాబాద్ సిటీ
ఎఐటియుసి ఆవిర్భావ దినోత్సవాన్ని జయప్రదం చేయండి అని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి వై.ఓమయ్య అన్నారు. ఏఐటీయూసీ జిల్లా కార్యాలయంలో జిల్లా కౌన్సిల్ సమావేశం ఉపాధ్యక్షులు చక్రపాణి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి వై.ఓమయ్య మాట్లాడుతూ.. ఈ నెల 31న ఏఐటీయూసీ ఆవిర్భావ దినోత్సవాన్ని జిల్లావ్యాప్తంగా విజయవంతంగా నిర్వహించాలని జెండాలను ఆవిష్కరించి ప్రదర్శనలు సభలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. 1920 అక్టోబర్ 31 న భారతదేశనికి సంపూర్ణ స్వాతంత్రం కావాలని ఈ దేశంలో ఉన్న కార్మిక వర్గానికి 8 గంటల పని దినం అమలు కావాలని పని భద్రత ఉండాలని కార్మికులకు చట్టాలు ఉండాలని బొంబాయి కేంద్రంగా ఏఐటీయూసీని ఏర్పాటు చేయడం జరిగిందని ఆనాటి నుండి దేశంలో ఉన్న కార్మికుల్ని ఐక్యం చేసే పోరాటం చేసిన ఫలితంగా చట్టాలు సాధించుకోవడం జరిగిందన్నారు.
ఈ దేశ కార్మిక వర్గానికి ఏఐటీయూసీ ఒక దిక్సూచిగా నిలబడిందని ఏఐటీయూసీ ద్వారా మాత్రమే భారతదేశం కార్మిక వర్గం సంపూర్ణ స్వాతంత్రం కోసం పోరాటం చేయడం తో పాటు కార్మికుల హక్కులను పొందడం జరిగిందన్నారు. కానీ ప్రస్తుతం కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం చట్టాలను రద్దు చేస్తూ కార్మికుల హక్కుల్ని హరించడంతోపాటు 12 గంటల పని విధానాన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుందని కార్మిక వేతనాలు తగ్గించే కుట్రలు చేస్తున్నారని మోడీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా 31న కార్మికుల్లో ప్రతిభ బోనాలని భవిష్యత్తు పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
అనంతరం జిల్లా ఏఐటీయూసీ అనుబంధ సంఘాల కార్మికుల సమస్యలపై తీర్మానాలను చేయటం జరిగిందన్నారు. ఈ కార్యక్రమం లో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు నర్సింగరావు, ఉపాధ్యక్షులు దేవేందర్, భాగ్యలక్ష్మి,కార్యదర్శి హనుమాన్లు, అనిల్ ,కవిత, సంపత్, భానుచందర్, రమేష్, వసంత, రాధా కుమార్, అజీజ్, శ్రీనివాస్, జిల్లా సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.



