Friday, September 19, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో కళాకారుల ఆటాపాటను జయప్రదం చేయండి!

తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో కళాకారుల ఆటాపాటను జయప్రదం చేయండి!

- Advertisement -

నవతెలంగాణ – నిజామాబాద్ సిటీ 
భూమి కోసం, భుక్తి కోసం , విముక్తి కోసం జరిగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో కళాకారుల పాత్ర అనే అంశముపై సాంస్కృతిక సంఘాల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో నిజామాబాద్ నగరంలో 21 సెప్టెంబరు 2025న జరిగే కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని దాసు, సిర్పలింగం, చంద్రశేఖర్, రాధా కిషన్, నర్సారెడ్డి, సాయిరెడ్డి, పోశెట్టిలు కోరారు. 

19 సెప్టెంబర్ 2025న నిజామాబాదులోని జిల్లా పరిషత్ దగ్గర ఉన్న పెన్షనర్స్  సాంస్కృతిక జేఏసీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పాత్రికేయుల సమావేశంలో అరుణోదయ దాసు మాట్లాడుతూ మహత్తర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో కళాకారుల తమ అమూల్యమైన ప్రాణాలను సైతం అర్పించారని ఆయన తెలిపారు. “బండెనుక బండి కట్టి పదహారు బండ్లు కట్టి ఈ బండ్లో వస్తావు కొడుకు నైజాము సర్కరోడా. నాజీల మించినౌరో నైజాము సర్కరోడా” అంటూ బండి యాదగిరి పాడిన పాట ఉద్యమానికి ప్రేరణ ఇచ్చిందని ఆయన అన్నారు.

రైతులు, కూలీలు, మహిళలు ప్రజలు నిజాం రక్కసి పాలనకు వ్యతిరేకంగా, భూస్వాముల ఆగడాలకు వ్యతిరేకంగా పోరాడి గ్రామ స్వరాజ్యాలను ఏర్పాటు చేసుకొని దేశానికి స్ఫూర్తిని ఇచ్చారని ఆయన అన్నారు. అందుకే పాట పదునైన ఆయుధమని నమ్మే  ప్రజా కళాకారులు ప్రజల పక్షాన నిలబడడానికి, ఆనాటి పోరాటంలో కళాకారుల పాత్రను నెమరు వేసుకొని, ఆటపాటతో సభను నిర్వహించాలని జేఏసీ భావిస్తుందని ఆయన తెలిపారు. ఆదివారం 21 సెప్టెంబర్ ఉదయం 11:30 గంటలకు కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు దాసు తెలిపారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -