నవతెలంగాణ – బిచ్కుంద
వివేకానంద స్వామి 163వ జయంతి పురస్కరించుకొని బిచ్కుంద పట్టణంలో వివేకానంద స్వామి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వివేకానంద ఉత్సవ సమితి అధ్యక్షులు రచ్చ శివకాంత్ మాట్లాడుతూ స్వామి వివేకానంద జీవితం యువతకు అందించిన ప్రేరణ, దేశాభివృద్ధిలో యువశక్తి పాత్ర గురించి, విద్యార్థులు, యువత స్వామి వివేకానంద ఆదర్శాలను అలవరుచుకుని ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని వివరించారు.
ప్రధాన కార్యదర్శి సీమ గంగారాం మాట్లాడుతూ వివేకానంద బోధనలు నేటి యువతకు మార్గదర్శకమని, వాటిని ఆచరణలో పెట్టినప్పుడే సమాజం ముందుకు సాగుతుందని 1984లో భారత ప్రభుత్వం స్వామి వివేకానంద జయంతిని జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకోవాలని ప్రకటించిందని ఆనాటి నుండి జనవరి 12వ తేదీన జాతీయ యువజన ఉత్సవం జరుపుకుంటున్నమని అన్నారు.
ఈ కార్యక్రమంలో వివేకానంద ఉత్సవ సమితి సభ్యులు వాసరేనాగనాథ్, ఉమాకాంత్, హనుమంత్ రావు, తపస్ బిచ్కుంద అధ్యక్షులు ముత్యాల సందీప్, ప్రధాన కార్యదర్శి పేర్ శెట్టి శంకర్, ప్రధానోపాధ్యాయులు ప్రశాంత్, పండరి, విద్యార్థులు పాల్గొన్నారు.



