Saturday, November 8, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్భక్త కనక దాసు 538వ జయంతి వేడుకలు

భక్త కనక దాసు 538వ జయంతి వేడుకలు

- Advertisement -

– పాల్గొన్న ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి 
నవతెలంగాణ – జోగులాంబ గద్వాల :  గద్వాల నియోజకవర్గం కె.టి దొడ్డి మండల పరిధిలోని చింతల కుంట, సుల్తానా పురం  గ్రామాలలో భక్త కనకదాసు 538జయంతి వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే బంద కృష్ణమోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై భక్త కనకదాసు విగ్రహానికి పూలమాలవేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కురువ కులస్తులు కురువ డోలతో  ఎమ్మెల్యేకు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ కురువ కులస్తులందరికీ భక్త కనక దాసు 538వ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. 

కర్ణాటక ప్రాంతంలో ఉడిపి ప్రసిద్ధి పుణ్యక్షేత్రంలో శ్రీకృష్ణుని దేవాలయంలో శ్రీకృష్ణుని దర్శించుకోవడానికి అవకాశం కల్పించేవారు కాదనీ, దేవాలయం వెనుక నుండి శ్రీకృష్ణుని భక్తిగా ప్రార్థించడం జరిగింది కనకదాసు ఆయన భక్తికి మెచ్చి శ్రీకృష్ణుడు వెనుక  తిరిగి కనకదాసు కు దర్శనం ఇవ్వడం జరిగిందన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో  గద్వాల నియోజకవర్గం లో బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి, అభివృద్ధికి హర్నిశలు  కృషి కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ కురవ హనుమంతు, జిల్లా గ్రంథాలయ మాజీ ఛైర్మన్ జంబు రామన్ గౌడు,మాజీ, జెడ్పీటీసీ రాజశేఖర్, మాజీ ఎంపిపి విజయ్, ,సింగిల్ విండో డైరెక్టర్ రఘు కుమార్ శెట్టి, నాయకులు  ఉరుకుందు,  మైలగడ్డ చంద్రశేఖర్ విశ్వనాథ్ రెడ్డి, కృష్ణ రెడ్డి , నర్సింహులు, ఖాజా , వీరేష్, ఖాసీం  పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -