Tuesday, March 31, 2026
E-PAPER
Homeజాతీయంభారీగా పెరగనున్న సిమెంట్ ధరలు

భారీగా పెరగనున్న సిమెంట్ ధరలు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం నిర్మాణ రంగంపై తీవ్ర ప్రభావం చూపనుంది. దీనితో ఏపీ, తెలంగాణలో సిమెంట్ బస్తా ధర రూ.50 పెరగనున్నట్లు మార్కెట్ వర్గాలు తెలిపాయి. ఈ ధరల పెరుగుదల వచ్చే వారం నుంచే అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం రిటైల్ మార్కెట్లో సిమెంట్ బస్తా ధర రూ.280-320 మధ్య ఉండగా, ఈ పెంపుదల తర్వాత రూ.320-370కి చేరనుంది. సిమెంట్ కంపెనీలు ఉపయోగించే పెట్రోలియం కోక్ ధర 130 డాలర్ల నుంచి 165 డాలర్లకు చేరడం, ఇండస్ట్రియల్ డీజిల్ రేటు రూ.23.75 పెరగడం వంటి కారణాల వల్ల ఈ ధరల పెరుగుదల చోటుచేసుకుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -