నవతెలంగాణ-హైదరాబాద్: పదేండ్లకుకొకసారి దేశంలో జనాభా లెక్కలు చేపట్టానున్న విషయం తెలిసిందే. 2011లో జనాభా లెక్కలు నిర్వహించారు. తాజాగా 2021లో నిర్వహించాల్సి ఉన్నా.. కొవిడ్ విపత్తు తో పాటు పలు కారణాలతో కేంద్ర ప్రభుత్వం వాయిదా వేస్తు వచ్చింది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా జనాభా లెక్కలను నిర్వహించాలని భారత్ నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈక్రమంలోనే అందుకు ప్రభత్వం సన్నాహాలు మొదలు పెట్టింది. వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి మొదటి దశలో భాగంగా జనాభా గణన చేపట్టాలని కసరత్తులు చేస్తోంది. అదే విధంగా ఈసారి నిర్వహించే ప్రక్రియలో మొట్టమొదటిసారిగా డిజిటల్ రూపంలో జనాభా గణన చేపట్టనున్నారు.
అందుకు దేశంలోని అన్ని విభాగాల అధికారులతో రిజిస్ట్రార్ జనరల్ మరియు భారత జనాభా గణన కమిషనర్ మృతుంజయ్ కుమార్ నారాయణ్ చర్చలు కొనసాగిస్తున్నారు. అన్ని విభాగాలతో సమన్వయం చేసుకుంటు ఈ ప్రక్రియను దిగ్విజయంగా పూర్తి చేయాలని ఆయన వుహ్యాలు రచిస్తున్నారు. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల (UTలు) సెన్సస్ ఆపరేషన్స్ డైరెక్టర్లు (DCOలు), DCO ప్రతినిధులు, భారత రిజిస్ట్రార్ జనరల్, సెన్సస్ కమిషనర్ కార్యాలయం (ORGI) నుండి అధికారులతో పలు మీటింగ్లు నిర్వహించారు.
2027 భారత జనాభా లెక్కింపు రెండు దశల్లో నిర్వహించనున్నారు. మొదటి దశలో, గృహాల జాబితా, గృహ గణన ఏప్రిల్ నుండి సెప్టెంబర్ 2026 వరకు నిర్వహించబడతాయి.ఈ నెల ప్రారంభంలో ముగిసిన దశ I – గృహనిర్మాణం గృహ గణన ప్రీ-టెస్ట్ వ్యాయామం పూర్తింది. రెండో దశలో ఫిబ్రవరి 2027లో జరగనున్న జనాభా గణన (PE) ఉంటుంది.
పీఎం నరేంద్ర మోడీ అధ్యక్షతన డిసెంబర్ 12న జరిగిన కేంద్ర మంత్రివర్గం, రూ.11,718.24 కోట్లతో 2027లో భారత జనాభా లెక్కింపు నిర్వహించాలనే ప్రతిపాదనను ఆమోదించింది. 2025 ఏప్రిల్ 30న కేబినెట్ కమిటీ తీసుకున్న నిర్ణయాల ప్రకారం, రాబోయే జనాభా లెక్కింపులో కుల గణన కూడా జనాభా లెక్కింపులో భాగంగా ఉంటుంది. 2027 జనాభా లెక్కింపు దేశంలో 16వ జనాభా లెక్కింపు స్వాతంత్ర్యం తర్వాత 8వ జనాభా లెక్కింపు అవుతుంది.

