- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : దాశరధి , ఆరుద్ర జీవితము – సాహిత్యం ” అనే అంశంపై రెండు రోజుల జాతీయ సదస్సు నిర్వహించబడింది. ఈ సదస్సుకు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఇబ్రహీంపట్నం తెలుగు శాఖ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ చింతల రాకేశ్ భవాని హాజరై ” దాశరధి సినిమా పాటలు ఒక పరిశీలన ” అనే అంశంపై పత్ర సమర్పణ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ రాకేశ్ భవాని మాట్లాడుతూ పాటల పయోనిధిగా , సినీగీతాల వారధిగా తెలుగు సినీ గేయ సాహిత్యాన్ని దాశరధి సుసంపన్నం చేశారన్నారు. దాశరధి సినిమా పాటలను పాడుతూ వాటిని విశ్లేషించారు. విశ్వవిద్యాలయ స్థాయిలో దాశరధి సినిమా పాటల పై మరిన్ని పరిశోధనలు రావలసిన అవసరం ఉందన్నారు. అనంతరం సదస్సు నిర్వాహకులు డా .రాకేశ్ భవానిని సత్కరించారు.
- Advertisement -