Friday, February 20, 2026
E-PAPER
Homeజాతీయంఆరు ఈ-కామర్స్ సంస్థలకు కేంద్రం నోటీసులు..

ఆరు ఈ-కామర్స్ సంస్థలకు కేంద్రం నోటీసులు..

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: దేశంలో నిబంధనలకు విరుద్ధంగా డ్రోన్ జామర్లు, ఇతర వైర్‌లెస్ పరికరాలను ఆన్‌లైన్‌లో విక్రయిస్తున్న ఆరు ఈ-కామర్స్ సంస్థలకు కేంద్ర వినియోగదారుల పరిరక్షణ ప్రాధికార సంస్థ (సీసీపీఏ) నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రభుత్వ అనుమతి లేకుండా డ్రోన్ జామర్లు, జీపీఎస్ జామర్లు, యాంటీ-డ్రోన్ సిస్టమ్స్ వంటి నిషేధిత పరికరాలను విక్రయించడంపై సీసీపీఏ తీవ్రంగా స్పందించింది. నోటీసులు అందుకున్న సంస్థలలో ఎవర్‌సే, ఇండియామార్ట్, ఎక్స్‌బూమ్, జావియట్ ఏరోస్పేస్, ఎయిర్‌వన్ రోబోటిక్స్, మావెరిక్ డ్రోన్స్ & టెక్నాలజీస్ ఉన్నాయి. ఈ సంస్థలు వినియోగదారుల పరిరక్షణ చట్టం-2019తో పాటు, టెలికాం, వాణిజ్య నియంత్రణ చట్టాలను ఉల్లంఘించినట్లు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -