నవతెలంగాణ-హైదరాబాద్: ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్- పాక్ ఉద్రిక్తతలపై పార్లమెంటులో చర్చ జరపాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అందుకోసం పార్లమెంట్‌లో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని పట్టుబట్టాయి. ఈక్రమంలో ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ, మల్లిఖార్జున ఖర్గే లతోపాటు పలు పార్టీల నేతలు కేంద్రానికి పలుమార్లు లేఖలు రాశారు. తాజాగా శుక్రవారం అందుకు కేంద్రం నిరాకరిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసేందుకు కేంద్రం సముఖంగా లేదని ప్రభుత్వవర్గాలను ఉద్దేశిస్తూ.. జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. ఈ ఏడాది జులైలో జరిగే వర్షాకాల సమావేశాల్లోనే ప్రతిపక్షాలు లేవనెత్తే ప్రశ్నలకు కేంద్రం సమాధానం చెప్పనున్నట్లు తెలుస్తోంది.ఏప్రిల్ 22న పహెల్గాంలో ముష్కరులు టూరిస్టులపై కాల్పులు జరిపారు. ఈ దాడి లో 26 మంది అమాయకులు చనిపోయారు. ఇందుకు ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ పేరుతో పాక్ దాడి చేసిన విషయం తెలిసిందే.
పార్లమెంట్‌లో ఆపరేషన్ సిందూర్‌పై చర్చకు కేంద్రం విముఖత
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES