నవతెలంగాణ – హైదరాబాద్: ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేసిన జగ్‌దీప్ ధన్‌ఖడ్‌కు ప్రతిపక్షాలు వీడ్కోలు విందు ఏర్పాట్లు చేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం. అనారోగ్య కారణాల దృష్ట్యా ధన్‌ఖడ్ ఇటీవల రాజీనామా చేయగా, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దానిని ఆమోదించారు. అయితే, ఆయన రాజీనామాకు ఇతర కారణాలు కూడా ఉండొచ్చని ప్రతిపక్షాలు అనుమానిస్తున్నాయి. ఉపరాష్ట్రపతి ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది. ఈనేపథ్యంలో ఆయనకు వీడ్కోలు పలకాలని ఇప్పటికే కాంగ్రెస్ కోరిందని, కానీ కేంద్రం మాత్రం మౌనం వహించిందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ధన్‌ఖఢ్‌కు వీడ్కోలు కార్యక్రమం నిర్వహించాలని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ డిమాండ్ చేశారు. అయితే, కేంద్రం దీనిపై స్పందించలేదు. కేంద్ర మంత్రులు కిరణ్ రిజిజు, జేపీ నడ్డా కూడా ఈ విషయంపై ఏం మాట్లాడలేదని అధికార వర్గాలు తెలిపాయి.
Jagdeep Dhankhar: కేంద్రం మౌనం.. ధన్‌ఖడ్‌కు విపక్షాల వీడ్కోలు విందు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES