- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: ఈ ఏడాది ఫిబ్రవరి 1 నుంచి సిగరెట్, బీడీ, పాన్ మసాలా వంటి పొగాకు ఉత్పత్తుల ధరలు భారీగా పెంచుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. పాన్ మసాలా, సిగరెట్లు, ఇతర పొగాకు సంబంధిత ఉత్పత్తులపై 40 శాతం జీఎస్టీ విధించనుండగా, బీడీలపై 18 శాతం జీఎస్టీ అమల్లోకి రానుంది. అంతేకాకుండా పాన్ మసాలాపై ఆరోగ్య సెస్‌తో పాటు జాతీయ భద్రత సెస్‌ను కూడా ప్రభుత్వం విధించింది. జీఎస్టీతో పాటు అదనపు ఎక్సైజ్ ట్యాక్స్ కూడా వర్తించడంతో సిగరెట్, బీడీ ధరలు గణనీయంగా పెరుగుతాయని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం మార్కెట్‌లో ఒక్క సిగరెట్ సుమారు రూ.18కి లభిస్తుండగా, ఫిబ్రవరి 1 నుంచి దాని ధర రూ.72 వరకు పెరిగే అవకాశం ఉంది.
- Advertisement -



