Tuesday, December 30, 2025
E-PAPER
Homeజాతీయంవార్షిక బ‌డ్జెట్‌కు కేంద్రం స‌న్నాహాలు..నిపుణుల‌తో పీఎం మోడీ భేటీ

వార్షిక బ‌డ్జెట్‌కు కేంద్రం స‌న్నాహాలు..నిపుణుల‌తో పీఎం మోడీ భేటీ

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: వార్షిక బ‌డ్జెట్‌కు కేంద్ర ప్ర‌భుత్వం స‌న్నాహాలు మొద‌లు పెట్టింది. వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రి ఒక‌టో తారీఖున వార్షిక బ‌డ్జెట్‌ను కేంద్రం ప్ర‌వేశ‌పెట్ట‌నుంది. ఈమేర‌కు భార‌త్ స‌ర్కార్ క‌స‌ర‌త్తులు మొద‌లు పెట్టింది. ఆయా రంగాల‌కు నిధుల‌ కేటాయింపుల‌పై ప్ర‌ణాళిక‌ను సిద్ధం చేస్తోంది. అందులో భాగంగా మేధావుల స‌ల‌హాలు తీసుకోవాల‌ని భావించింది. ఈ నేప‌థ్యంలో పీఎం మోడీ ఆర్థిక నిపుణుల‌తో భేటీ కానున్నారు.

ఈ సమావేశంలో ప్రధాని మోడీ ఆత్మనిర్భర్ భారత్ లక్ష్య సాధన, 2047 నాటికి వికసిత్ భారత్ అవతరణకు సంబంధించిన దీర్ఘకాలిక వ్యూహాలపై దృష్టి సారించేందుకు చేపట్టాల్సి విధివిధానాలపై డిస్కస్ చేయనున్నారు. ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితులు, అగ్ర రాజ్యం అమెరికా నుంచి భారత ఎగుమతులపై 50 శాతం టారిఫ్ విధించిన నేపథ్యంలో ఆర్థిక రంగ నిపుణులతో నేటి భేటీ మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇప్పటికే వ్యాపార సంఘాలు, ట్రేడ్ యూనియన్లు, రాష్ట్రాల ఆర్థిక మంత్రులు, వివిధ రంగాల ప్రతినిధులతో పలు ప్రీ-బడ్జెట్‌పై సంప్రదింపులు చేసిన సంగతి తెలిసిందే.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -