-జిల్లా అధ్యక్షులు కల్లెపు అడివయ్య
నవతెలంగాణ – ఆలేర్ రూరల్ : రైతులకు సరిపడా యూరియా అందించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని అఖిల భారత రైతుకూలీ సంఘం జిల్లా అధ్యక్షులు కల్లెపు అడివయ్య,ప్రధాన కార్యదర్శి బేజాడి కుమార్ విమర్శించారు.సోమవారం ఆలేరు తహసిల్దార్ కార్యాలయం ముందు జిల్లా ఏ ఐ కే ఎం ఎస్ ఆధ్వర్యంలో రైతులకు యూరియాను అందుబాటులో ఉంచాలని కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు.తహశీల్దార్ కు డిమాండ్స్ తో కూడిన వినతి పత్రం సమర్పించారు.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాటలే దీనికి నిదర్శనం
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుత వర్షాకాలం(ఖరీఫ్) వ్యవసాయ సీజన్ లో రైతులకు సరిపడే యూరియా ను అందివ్వడం లో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ముఖ్యంగా బీ జే పీ మోడీ ప్రభుత్వం విఫలం అయిందని,దీనికి ఉదాహరణ మొన్న కేంద్ర బీ జే పీ మంత్రి కిషన్ రెడ్డి యూరియా సరఫరా లో మా ప్రభుత్వం నుంచి లోపం జరిగిందని ఒప్పుకోవడమే దీనికి నిదర్శనమని,యూరియా కొరత వల్ల నేటికీ వరి,పత్తి తదితర పంటలకు యూరియా వేయలేక రైతులు పంటలు పాడైపోతాయా ఏమో అనే ఆందోళనకు గురవుతున్నారు.పాలకులకు మాత్రం ఏమాత్రం బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారన్నారు.
వ్యవసాయ రంగం అమెరికాపై ఆధారపడేలా…. మోడీ
బీ జే పీ మోడీ ప్రభుత్వం ఈ దేశ రైతాంగం,వ్యవసాయ రంగాన్ని బడా కార్పోరేట్ సంస్థలకు కట్టబెట్టాలని చూస్తుందని,అమెరికా తో స్వేచ్చ వాణిజ్యం ఒప్పందాలను చేసుకుంటుందని,దేశ వ్యవసాయం రంగం పై పూర్తి ఆధిపత్యం ఉండేలా మోడీ ప్రభుత్వం లొంగుబాటును ఆసర చేసుకొని అమెరికా తీవ్రంగా ప్రయత్నం చేస్తుందన్నారు .
అమెరికా కోసమే కొత్త ట్రాక్టర్లు
అందులో భాగంగానే పది సంవత్సరాల కాలంనాటి ట్రాక్టర్ లను వాడకూడదని కొత్త ట్రాక్టర్ లను వాడాలనే కుట్రలు అమెరికా చేస్తుందని ఆ విధంగా రైతాంగానికి మోడీ ప్రభుత్వం తీరని అన్యాయం తలపెడుతుందని ఆరోపించారు.ఈ ధర్నాలో సీపీఐ (ఎం.ఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఆర్.జనార్ధన్,ఏ ఐ కే ఎం ఎస్ జిల్లా గౌరవాధ్యక్షులు మామిడాల సోమయ్య,జిల్లా ఉపాధ్యక్షులు చిర బోయిన రాజయ్య,జిల్లా సహాయ కార్యదర్శి పిన్నపురెడ్డి రాఘవ రెడ్డి,కోశాధికారి బర్మ బాబు,జిల్లా నాయకులు ఇక్కిరి సహదేవ్,పద్మశ్రీ సుదర్శన్ పాల్గొన్నారు.
యూరియా అందించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES