నవతెలంగాణ-హైదరాబాద్: కులగణన చేపట్టాలనే రాహుల్ గాంధీ డిమాండ్ చేస్తున్నా.. పట్టించుకోని కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు ప్రజల ఒత్తిడికి తలొగ్గి అందుకు ఒప్పుకుందని తెలిపారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర సందర్భంగా సామాజిక అసమానతలు తొలగించడానికి.. దేశ వ్యాప్తంగా కులగణన చేయాలని డిమాండ్ చేశారని గుర్తు చేశారు. రాష్ట్రంలో తాము నిర్వహించిన కులగణనను ఇన్నాళ్లు అపహాస్యం చేసిన బీజేపీ ఇప్పుడు తమ దారిలోకి రావడం సంతోషకర పరిణామమని మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఇవాళ ఆయన ఖమ్మం జిల్లా ముదిగొండ మండల పరిధిలోని మల్లన్నపాలెం గ్రామంలోని రామలింగేశ్వర స్వామి దేవస్థానం పునర్నిర్మాణ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం మీడియా మాట్లాడుతూ..తెలంగాణలో కులగణన చేసి దేశానికి రోల్ మోడల్‌గా నిలిచామని అన్నారు. ప్రభుత్వం నిర్ణయాల్లో కులగణనను పరిగణలోకి తీసుకుంటామని తెలిపారు. కులగణన సర్వే ఫలితాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు పిలునిచ్చారు.
కేంద్ర కులగణన ప్రకటన..రాహుల్ జోడోయాత్ర ఫలితమే: భట్టి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES